హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి.. మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక మంత్రి నిరంజన్ రెడ్డికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.