Breaking News
Home / Lifestyle / Business / భారత్ లో లంబోర్గిని సరికొత్త కారు విడుదల ….

భారత్ లో లంబోర్గిని సరికొత్త కారు విడుదల ….

ఇంటర్నెట్‌డెస్క్: సూపర్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లోకి సరికొత్త ‘హరికేన్‌ ఈవో స్పైడర్‌’ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్‌ 10న ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో లంబోర్గిని ముంబయిలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది. సాధారణ కూపే వెర్షన్‌తో పోలిస్తే హరికేన్‌ ఈవో దాదాపు 120 కిలోల బరువు అధికంగా ఉంది. ఈ కొత్త కారులో ఎలక్ట్రో హైడ్రాలిక్‌ రూఫ్‌ ఫోల్డింగ్‌ వ్యవస్థను అమర్చారు. 50 కిలోమీటర్ల వేగంతో ప్రయణించేటప్పుడు కేవలం 17 క్షణాల్లో కారు రూఫ్‌ను మడతపెట్టేస్తుంది.

ఈ కారు ఆకారాన్ని మరింత ఎరోడైనమిక్‌గా తీర్చిదిద్దారు. దీనికి రెండు డోర్లు ఉన్నాయి. కారులో 8.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ను అమర్చారు. కారు ఫంక్షన్లు, పనితీరు, యాపిల్‌కార్‌ప్లే, వాయిస్‌ కమాండ్స్‌, డ్యూయల్‌ కెమెరా టెలిమెట్రీ వ్యవస్థ, అత్యధిక సామర్థ్యం ఉన్న హార్డ్‌డిస్క్‌ను ఈ టచ్‌ స్క్రీన్‌లో అమర్చారు. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే 5.2లీటర్‌ వీ10 ఇంజిన్‌ పవర్‌ కూపే వెర్షన్‌ను పెట్టారు. ఈ ఇంజిన్‌ 8,000 ఆర్‌పీఎం వద్ద 631 బీహెచ్‌పీ శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 600 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం 3.1 క్షణాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *