Breaking News
Home / National / మెట్రో స్టేషన్‌లో పెద్దఎత్తున నకిలీ కరెన్సీ స్వాధీనం

మెట్రో స్టేషన్‌లో పెద్దఎత్తున నకిలీ కరెన్సీ స్వాధీనం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ ఉన్న ఒక బ్యాగ్‌ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆదివారంనాడు స్వాధీనం చేసుకుంది. ఇందులో రూ.4,64,000 ముఖ విలువ కలిగిన నకిలీ కరెన్సీ ఉంది. అన్నీ రూ.500 నోట్ల రూపంలోనే ఉన్నాయని, కాపలాలేని 8వ నెంబర్ గేట్ వద్ద ఈ బ్యాగ్ కనిపించిందని సీఐఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. స్వాధీనం చేసుకున్న బ్యాగును ఢిల్లీ మెట్రో రైల్ పోలీసులకు (డీఎంఆర్‌పీ) అప్పగించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *