Breaking News
Home / Film News / ఆ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న తాజా చిత్రం…

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న తాజా చిత్రం…

ఫిల్మ్ న్యూస్: దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే సినిమా రూపొందనుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో రాచకొండ విద్యాసాగర్ అనే కొత్త దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్‌తో పాటు గమ్యం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ(చి.ల.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *