Breaking News
Home / Film News / విడుదలకు సిద్ధమవుతున్న తాజా చిత్రం…

విడుదలకు సిద్ధమవుతున్న తాజా చిత్రం…

ఫిల్మ్ న్యూస్: మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో ఆశించిన ఫలితాన్నే అందుకున్న ఆయన, తాజా చిత్రంగా ‘తెనాలి రామకృష్ణ BA. BL’ రూపొందింది. హాస్యభరితమైన కథలను జనరంజకంగా తెరకెక్కించగల జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తెనాలి రామకృష్ణ అనగానే ఆయన చేసిన హాస్య విన్యాసాలు గుర్తుకువస్తాయి. అలాగే ఈ సినిమా అంతా కూడా పూర్తి వినోదభరితంగానే సాగుతుందని అంటున్నారు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పోసాని మురళీశర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *