Breaking News
Home / States / చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

నాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ అన్నారు. మంగళవారం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌లో హీరోమోటోకార్ప్‌ సంస్థ సహకారంతో రూ. 70 లక్షల నిధులతో అత్యాధునికంగా రూపొందిచిన పిల్లల ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. అదనపు డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన భారతదేశంలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిలో 45 శాతం మంది 35 ఏళ్లలోపు వయసువారు ఉండటం విచారకరం అని ఆయన పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిఒక్కరికి బాల్యం నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ తరహా పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *