Breaking News
Home / National / సుజిత్‌ తల్లిదండ్రులకు లారెన్స్‌ సూచన…..

సుజిత్‌ తల్లిదండ్రులకు లారెన్స్‌ సూచన…..

చెన్నై: బోరుబావిలో పడి మృతి చెందిన సుజిత్‌ ఆత్మ శాంతించాలంటే ఓ బిడ్డను దత్తత తీసుకుని సుజిత్‌ అనే పేరుపెట్టి పెంచుకోవాలని కొరియోగ్రాఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌ బాధిత తల్లిదండ్రులను కోరారు. గత శుక్రవారం బోరుబావిలో పడిన బాలుడు సుజిత్‌ను నాలుగు రోజుల అనంతరం అచేతనంగా వెలికి తీశారు. బాలుడు బ్రతికి రావాలని రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల వారు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు అతడు చనిపోవడంతో, అతని మృతికి రాజకీయ ప్రముఖులే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యాన్స్‌ మాస్టర్‌ రాఘవ లారెన్స్‌ మంగళవారం తన పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించడంపై ఆసక్తి లేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టించిన సుజిత్‌ మృతికి తాము అతని కుటుంబీకులకు సంతాపం ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాధలుగా వున్నారని, వారిలో ఓ బిడ్డను దత్తత తీసుకుని సుజిత్‌ పేరుపెట్టి పెంచుకుంటే ఆ బిడ్డ జీవితానికి అందించే వెలుగుతో ఆత్మశాంతిస్తుందన్నారు. సుజిత్‌ తల్లిదండ్రులు ఇలా చేయడంతో బిడ్డను కోల్పోయామన్న ఆవేదన వుండదని, మరో బిడ్డ రూపంలో కుమారుడ్ని చూసుకో వచ్చని ఆయన సూచించారు. దత్తత తీసుకునేందుకు నిర్ణయిస్తే తామే ముందుకు వచ్చి దగ్గర వుండి దత్తత కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ బిడ్డకు జీవితాంతం అయ్యే విద్యా ఖర్చును భరిస్తామని లారెన్స్‌ హామీ ఇచ్చారు. సుజిత్‌ మరణం కారణంగా లారెన్స్‌ మంగళ వారం జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం గమనార్హం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *