హైదరాబాద్: ఆదివారం కండక్టర్ సురేందర్ గౌడ్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సురేందర్‌గౌడ్ కుటుంబసభ్యులను బీజేపీ నేత లక్ష్మణ్ పరామర్శించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి మన హక్కులు సాధించుకుందామని ఆయన సూచించారు.
