Breaking News
Home / Uncategorized / పోలీసుల చర్యలపై అసంతృప్తితో ఉన్న నేతలు..

పోలీసుల చర్యలపై అసంతృప్తితో ఉన్న నేతలు..

అమరావతి:అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో లాఠీ అన్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయం. అమరావతి పర్యటనలో మొదలైన చిచ్చు మరింత పెద్దది అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు గత నెల 28న రాజధాని ప్రాంత పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో వెంటక పాలెం అనే గ్రామం వద్ద నిరసనకారులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు రాళ్లు వేయగా…కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ రాళ్లవల్లనే బస్సు అద్దం పగిలింది అని టీడీపీ వాదిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తుంటే నిరసన కారులను ఎందుకు కంట్రోల్ చేయలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని….ప్రభుత్వ అదేశాల మేరకే కుట్ర పూరితంగా దాడికి అవకాశం ఇచ్చారని మండి పడుతోంది. చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి, పోలీసుల చర్యలపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు.

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *