Breaking News
Home / States / Andhra Pradesh / చిన్నారి శస్త్రచికిత్సకు ప్రముఖ హీరో హామీ…

చిన్నారి శస్త్రచికిత్సకు ప్రముఖ హీరో హామీ…

పాతశ్రీకాకుళం: గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 14న శస్త్రచికిత్స చేయించేందుకు సినీ నటుడు మహేశ్‌బాబు ఆర్థిక సాయం చేయనున్నారని మహేశ్‌బాబు సేవాసమితి జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల చిన్నారి సందీప్‌ గుండెవ్యాధితో బాధపడుతున్నాడు. గుండెలో మూడు రంధ్రాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమని నిర్దారించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూశారు. దీనిపై మహేశ్‌బాబు జిల్లా సేవాసమితి స్పందించి ఈ విషయాన్ని హీరో మహేశ్‌బాబుకు తెలిపారు. దీంతో ఆయన స్పందించి విజయవాడలో ఆంధ్రా హాస్పటల్‌లో సందీప్‌కు శస్త్రచికిత్స చేయించేందుకు హామీ ఇచ్చారని ఉంకిలి తెలిపారు. ఇదే విషయం చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశామని వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *