Breaking News
Home / Film News / బిగ్‌బాస్‌ షోను నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ…

బిగ్‌బాస్‌ షోను నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ…

బిగ్‌బాస్ రియాల్టీ షో మరో వివాదంలో చిక్కుకుంది. హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ను వెంటనే నిలిపేయాలంటూ కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు లేఖ రాశారు. బిగ్‌బాస్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే నంద కిషోర్ లేఖ రాశారు. సమాజంలో అసభ్యతను వ్యాప్తి చేస్తూ, నైతిక విలువలను దెబ్బతీస్తున్న ఈ షోపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. బిగ్‌బాస్ హిందీ షో ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *