ఢిల్లీ: జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌లకు కేంద్రం కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను బదిలీ చేసింది. ఆయన్ను గోవా గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్లను నియమించింది. గురువారం నుంచి జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం జమ్మూకాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ గిరీశ్ చంద్ర ముర్ము, మాథుర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ లద్దాఖ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఆరోగ్యానికి, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
