Breaking News
Home / States / Andhra Pradesh / అక్రమంగా తరలిస్తున్నఇసుకను అడ్డుకున్న స్థానికులు

అక్రమంగా తరలిస్తున్నఇసుకను అడ్డుకున్న స్థానికులు

మలికిపురం : తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను స్థానికులు అడ్డుకున్నారు. దిండిలోని రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో గోదావరి ప్రక్కన ఇసుకను గుట్టలుగా ఉంచి రాత్రి సమయంలో ఇసుక రవాణా జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నల్లి డేవిడ్ రాజు మాట్లాడుతూ గుట్టుచప్పుడు కాకుండా స్థానిక నాయకుల అండతో ఇసుక అక్రమ రవాణా జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ నాయకత్వంలో పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతున్న సందర్భంలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కులు ఈ ఇసుక దందాకు పాల్పడుతున్నారన్నరు. రైల్వే పనులకు ఈ ఇసుకను ఉపయోగిస్తున్నట్టు మభ్యపెట్టి బయటకు అక్రమంగా ఈ ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంకు స్పందించి ఆర్ ఐ రత్నాకర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *