Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వెలగపూడిలో ఉన్నది టెంపరరీ అసెంబ్లీ భవనమే: జగన్

వెలగపూడిలో ఉన్నది టెంపరరీ అసెంబ్లీ భవనమే: జగన్

అమరావతి: ఏపీ చరిత్రలో ఇవాళ చరిత్రాత్మకమైన రోజని సీఎం జగన్‌ అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వెలగపూడిలో ఉన్నది టెంపరరీ అసెంబ్లీ భవనమేనన్నారు. మద్రాస్‌ను పోగొట్టుకున్నామని, ఆ తర్వాత కర్నూలును వదులుకున్నామని జగన్ గుర్తు చేశారు.

సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ..

‘‘ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు తప్పిదం వల్ల హైదరాబాద్‌ను వదులుకున్నాం. అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే నష్టపోతామని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. ఏపీ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కావొద్దని చెప్పింది. గంటన్నర స్పీచ్‌లో చంద్రబాబు చాలా అబద్ధాలు చెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోలేదు. టీడీపీ వాళ్లకు అమరావతిపైనా, రాష్ట్ర ప్రజలపైనా ప్రేమలేదు. ఇంతకన్నా రాక్షసులు, దుర్మార్గులు ఎక్కడా ఉండరేమో. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా గమనిస్తున్నారు. కమిటీ రిపోర్టును చంద్రబాబు పట్టించుకోలేదని శివరామకృష్ణన్‌ తన నిస్పృహను వెలిబుచ్చారు.’’ అని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *