Breaking News
Home / National / 13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0..

13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0..

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఎత్తివేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దేశంలోని 13 నగరాలు మినహా మిగతా అన్నిచోట్లా ఆంక్షలను ఎత్తివేయ‌వ‌చ్చ‌ని సమాచారం. హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్ల‌ను కూడా జూన్ 1 నుండి తెరవడానికి అనుమతినిస్తార‌ని సమాచారం. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూత‌నంగా రూపొందించిన‌ మార్గదర్శకాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్‌పట్టు, తిరువల్లూరు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను కొంత‌కాలం కొన‌సాగించ‌నున్నారు. మిగిలిన ప్రాంతాల్లో జూన్ 1 నుండి హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతి ల‌భించ‌వ‌చ్చు. అయితే ద‌శ‌ల‌వారీగా వీటికి అనుమ‌తులు ల‌భించ‌నున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్న‌ది. ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో లాక్‌డౌన్ 5.0కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించనున్నార‌ని స‌మాచారం.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *