Breaking News
Home / National / లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అన్‌లాక్‌-2లోకి ప్రవేశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జలుబు, దగ్గు వంటి వ్యాధుల సీజన్‌లోకి ప్రవేశిస్తున్నామన్నారు. కరోనా మృతుల విషయంలో ప్రపంచదేశాల కన్నా మెరుగ్గా ఉన్నామని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. అన్‌లాక్‌-1 తర్వాత ప్రజల వ్యవహారశైలిలో నిర్లక్ష్య ధోరణి కనిపించిందని, నిర్లక్ష్య ధోరణిని వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో నియమనిష్టలు పాటించామని, అలాంటి కట్టుబాట్లను తిరిగి దేశమంతా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కట్టడి ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. జాగ్రత్తలు పాటించనివారిని గట్టిగా మందలించాలన్నారు.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *