దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశాలో కొవిడ్ నిబంధనలను సర్కార్ కఠినతరం చేశాయి. మరో 14 రోజులపాటు కంప్లీట్ లాక్డౌన్ విధించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. అయితే లాక్డౌన్ను రాష్ట్రమంతటా కాకుండా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయనున్నట్లు ఒడిశా సర్కారు తెలిపింది. ఒడిశాలోని గంజామ్, ఖోర్ధా, కటక్, జాజ్పూర్ జిల్లాలతోపాటు రూర్కెలా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కంప్లీట్ లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 17న రాత్రి 9 గంటల నుంచి జూలై 31న అర్ధారాత్రి వరకు లాక్డౌన్ కొనసాగతుందని తెలిపింది.
