Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి జగన్ : లోకేశ్ ఎద్దేవా

గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి జగన్ : లోకేశ్ ఎద్దేవా

అమరావతి : గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. బోటు ప్రమాదం వెనకున్న రహస్యాన్ని జలసమాధి చేయాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు. ఎస్సైకి ఫోన్ చేసి బోటును వదలాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రమాదం వెనకున్న నిజాలను బయటపెట్టిన హర్షకుమార్‌ని కేసుల పేరుతో వేధిస్తున్నారని, ప్రభుత్వానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి సీఎం జగన్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇదే ఉదాహరణ అని లోకేశ్ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *