Breaking News
Home / National / అవినీతి అంటున్నారు.. ఎందుకు నిరూపించలేకపోయారు: లోకేష్

అవినీతి అంటున్నారు.. ఎందుకు నిరూపించలేకపోయారు: లోకేష్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ఏదో చేస్తారనుకుంటే తనపై విమర్శలు చేయడమేంటని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలపై పది సార్లు చాలెంజ్ చేశానని, ప్రభుత్వం మోదీ చేతుల్లో ఉందకదా.. ఎందుకు నిరూపించలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా… ఏపీకి ఏ మొహం పెట్టుకుని వచ్చారని ఆయన విమర్శించారు. ఏపీకి వచ్చిన మోదీ ఏమైనా హామీలు ఇస్తారనుకుంటే తననెందుకు తిట్టారని ప్రశ్నించారు. అవినీతి అంటున్నారు.. మరి గుడ్ గవర్నెన్స్ అవార్డు ఎందుకు ఇచ్చారన్నారు. నరేగా నిధుల వినియోగంలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందని, ఏపీకి 650 అవార్డులు ఇచ్చింది మోదీ పాలనలో ఉన్న కేంద్రమే కదా అని లోకేష్‌ వ్యాఖ్యానించారు.

Check Also

జ‌వాన్ ప్రదీప్‌సింగ్ కుటుంబం సంచ‌ల‌న వ్యాఖ్యలు

Share this on WhatsAppన్యూఢిల్లీ: అమ‌రుడైన జ‌వాన్ ప్రదీప్‌సింగ్ కుటుంబం సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ మాట‌ల‌ను, ప్రభుత్వాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *