Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటే….

సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటే….

అమరావతి: రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైందని ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్ దుయ్యబట్టారు. మహిళలపై జగన్‌ కి కక్ష దేనికో అర్థంకావట్లేదన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ.. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశారు. మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారా దుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు.

అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళ గారిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది’’ అని లోకేష్ ట్వీట్ చేశారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *