Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం…

లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం…

అమరావతి: టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన మీద పడేది. కాగా, టీడీపీ నిరసన కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఆపరేటింగ్ లోపం కారణంగా ఆ డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి కింద పడిపోయిందని భద్రతా సిబ్బంది తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *