Breaking News
Home / National / ఆ కంపెనీలు భారత్ వైపు చూపు… మరిన్ని బెనిఫిట్స్‌కు ఛాన్స్….నిర్మలా సీతారామన్

ఆ కంపెనీలు భారత్ వైపు చూపు… మరిన్ని బెనిఫిట్స్‌కు ఛాన్స్….నిర్మలా సీతారామన్

చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు…
బ్లూప్రింట్ తయారు చేస్తామని, ఇన్వెస్టర్లను సంప్రదించి భారత్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో వారికి చెబుతామని నిర్మలా సీతారామన్ అన్నారు. చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు త్వరలో కార్యాచరణ పథకం రూపొందిస్తామని చెప్పారు. అమెరికా – చైనా ట్రేడ్ టాక్స్ (వార్) నేపథ్యంలో చైనాలోని పలు కంపెనీలు బయటకు రావాలనుకుంటున్నాయి. వాటికి భారత్ ప్రత్యామ్నాయంగా కనిపించాలనేది నిర్మలా సీతారామన్ ఉద్దేశ్యం. అమెరికా – చైనా వాణిజ్య చర్చలపై నిర్మల స్పందిస్తూ… త్వరలో ముగుస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.

వియత్నాం వెళ్లినా…
అమెరికా – చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాలోని అనేక బహుళ జాతి కంపెనీలు (MNC) ముఖ్యంగా అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాల్ని భారత్ వంటి దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం, థాయ్‌లాండ్ కొన్ని MNCలను ఆకర్షించింది. అయితే ఆ కంపెనీల విస్తరణకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులు వియత్నాంలో దొరకడం కష్టంగా ఉంది. దీంతో నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేశారు. ముందు ఒక కార్యాచరణ పథకం రూపొందిస్తామని, దాని ఆధారంగా పెట్టుబడులకు భారత్‌ ఎంత ఆకర్షణీయమైన దేశమో ఆ కంపెనీలకు వివరిస్తామన్నారు.

ఆ కంపెనీలు భారత్ వైపు చూపు… మరిన్ని బెనిఫిట్స్‌కు ఛాన్స్
చైనాలో ఎలక్ట్రానిక్ పరికరాలు, లిథియమ్ అయాన్ బ్యాటరీసలు, సెమీ కండక్టర్స్ వంటి కీలక వస్తువుల తయారీలో ఉన్న అనేక అమెరికాMNCలు తమ ఉత్పత్తి కేంద్రాల్ని భారత్ తరలించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే అనుమతులు పొందడంలో ఇబ్బందులు, పన్నుల భారంతో వెనుకాడుతున్నాయి. ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు భారత్ వచ్చేలా ఆ కంపెనీలను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామని నిర్మల చెబుతున్నారు. ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ భారీగా తగ్గించారు. కొత్తగా తయారీ రంగంలోకి వచ్చే కంపెనీలపై పన్ను భారాన్ని మోడీ ప్రభుత్వం ఇటీవల 15% తగ్గించింది. మరిన్ని బెనిఫిట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు చైనా నుంచి భారత్ వైపు వచ్చేందుకు 200 కంపెనీల వరకు చూస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్
అమెరికాతో వాణిజ్య సంబంధాలపై నిర్మల స్పందించారు. త్వరలో యూఎస్- ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వస్తాయన్నారు.

భారత్, చైనా బాగుంటే…
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు భారత్, చైనా దేశాల వృద్ధి పైనే ఆధారపడి ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలా ఉండదన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉన్నా భారత్, చైనా జీడీపీ మెరుగు పడుతుందన్నారు. చైనా కంటే భారత్ వృద్ధి రేటు ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ అనుకూల ప్రభావం గ్లోబల్ ఎకానమీపై పడుతుందని చెప్పారు. భారత్, చైనా డీజీపీ బాగుంటే ప్రపంచ జీడీపీ బాగున్నట్లే అన్నారు.

అంతర్జాతీయ సహకారం అవసరం..
ప్రస్తుత అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితులు బహుళ సహకార వ్యవస్థల బలోపేతానికి పిలుపునిస్తున్నాయని నిర్మల అన్నారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాల ప్రభుత్వాల చర్యలకు తోడు అంతర్జాతీయస్థాయిలో సహకారం ఉండాలని చెప్పారు కాగా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు  గురించి నిర్మల మాట్లాడుతూ… ఇందులో రూ.4,355 కోట్ల మేర మోసం జరిగిందని చెప్పారు.

IMP కోటాపై అసంతృప్తి
ప్రస్తుతIMP కోటా విధానంపై నిర్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల కోటా పెంపుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు సరైన మద్దతు లేకపోవడాన్ని తప్పుపట్టారు. వచ్చే ఏడాది జరిగే సమావేశంలో అయినా మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్‌ నిబంధనల ప్రకారం ప్రతి అయిదేళ్లకు ఈ కోటా విధానాన్ని సమీక్షించాలి. చాలా కాలంగా దీనిపై ఎలాంటి సమీక్ష జరగటం లేదు. ఐఎంఎఫ్ ఓటింగులో చాలా ఏళ్ళుగా అమెరికాదే ఆధిపత్యం. ఐఎంఎఫ్ కోటాలో అమెరికా వాటా 16.52 శాతం. దీంతో కొన్ని దేశాలకు అవసరమైన సమయంలో రుణాలు అందకుండా అమెరికా వీటో చేస్తోంది.

Check Also

థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్… జులై 20 నుంచి ప్రారంభం

Share this on WhatsAppప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సినిమా థియేటర్లను మూసేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *