Breaking News
Home / States / రవిప్రకాష్‌, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు

రవిప్రకాష్‌, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, హీరో శివాజీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో జారీ చేసిన నోటీసులకు వారిద్దరూ స్పందించకపోవడంతో కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో గత అర్ధరాత్రి ఇద్దరికీ లుక్ అవుట్ నోటీసులు సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.

రవిప్రకాష్ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే షేర్లు విషయంలో కూడా రవిప్రకాష్, శివాజీ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Check Also

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో…

Share this on WhatsAppచదువులో ప్రతిభ చాటిన యువకుడు 2018 సీఏ ఫలితాల్లో 20వ ర్యాంకు ఐసీఎస్‌‌ఐలో ట్యాక్స్‌మాన్స్‌ ప్రైజ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *