Breaking News
Home / National / ఆ లిస్టు చూసి..

ఆ లిస్టు చూసి..

పశ్చిమ బెంగాల్:ప్రశాంత్ కిషోర్ .. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలకు అతనో ఆశాకిరణం .. ఎన్నికలను కూడా ఓ కార్పొరేట్ కంపెనీ వ్యవహారంలా మార్చేసిన ఘనుడాయన . ఎన్నికల వ్యూహకర్తగా ఆయన సక్సస్ రేటు బాగానే ఉంది . ఇటీవల ఏపీలో వైసీపీని అధికారంలో తీసుకురావడంలో ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయన్న పేరు వచ్చింది . అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ఆయన సేవలు వినియోగించుకుంటోంది .అయితే అక్కడ రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ కు టీఎంసీ నేతలు షాక్ ఇస్తున్నారట . ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు . అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు . ఎన్నికల వ్యూహాల అమలు కోసం .. ప్రతి పోలింగ్ బూత్ లోను ఐదుగురు ఎస్సి కార్యకర్తలను గుర్తించి వారి పేర్లను పంపించాలని ప్రశాంత్ కిషోర్ బృందం టీఎంసీ నేతలను కోరిందట .

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *