Breaking News
Home / States / ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు…

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు…

హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ కుదేలవుతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ”నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. ఆర్టీసీ భూముల లీజు వివరాలు బయటపెట్టాలి” అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *