రాజోలు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో రాజోలు ఆర్టీసీ డిపో ఎదుట జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు పీతల రామచంద్రరావు మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో ఆర్ధిక మాంద్యం వచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు బీజేపీ రెండు లక్షల కోట్లు రాయితీలిచ్చిందని ఇటివల కాలంలో రూ.1.25 లక్షల కోట్లు ఆర్బిఐ నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం అంబానీ, అధాని అంటి బడా పెట్టుబడీదార్లకు ఉద్దీపన పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారాలు వేస్తోందని పేర్కొన్నారు.
