Breaking News
Home / States / Andhra Pradesh / లారీ డ్రైవర్‌ దారుణ హత్య

లారీ డ్రైవర్‌ దారుణ హత్య

తూర్పుగోదావరి: కాకినాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుడారి గుంటలో లారీ డ్రైవర్‌ బ్రహ్మానందం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బ్రహ్మానందం ఇంట్లోకి చొరబడి కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన దుండగులు బ్రహ్మానందం భార్య కళ్లముందే ఈ దారణానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకన్నారు. ఈ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *