Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం….

గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం….

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం నిలేశ్వర పాలెంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూలీగా పని చేసే హనుమనాయక్ (26), టీటీసీ చదువుతున్న అప్సానా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్సానాపై మిస్సింగ్ కేసు నమోదు అయింది. సడెన్‌గా వీరిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనలో నాయక్ మృతి చెందగా అప్సానా పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *