Breaking News
Home / States / మృత్యువును జయించి ఒక్కటైన ప్రేమజంట

మృత్యువును జయించి ఒక్కటైన ప్రేమజంట

బావ దక్కడేమోనని విషం తాగిన మరదలు
ఆందోళనతో అదే పని చేసిన ప్రియుడు
ఆస్పత్రి సాక్షిగా నిఖా.. వికారాబాద్‌లో ఘటన
వికారాబాద్‌: ఇద్దరూ బావా మరదళ్లు. మనసిచ్చిపుచ్చుకున్నారు. ఏ ఒక్కరూ విషయాన్ని పెద్దలకు చెప్పలేదు. అమ్మాయి కుటుంబీకులేమో ఆమెకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో పడ్డారు! తనకు బావ దూరమవుతాడేమోననే ఆందోళనతో అమ్మాయి పురుగుల మందు తాగితే.. మరదలు లేని తానెందుకంటూ అతడూ విషం తాగాడు. ఆ ప్రేమికులు.. వికారాబాద్‌ జిల్లా అత్తెపల్లికి చెందిన రేష్మాబేగం, కుక్కిందకు చెందిన నవాజ్‌! ఇరు వర్గాల వివరాల ప్రకారం.. రేష్మాబేగం అక్కను నవాజ్‌ అన్నకు ఇచ్చి పెళ్లి జరిపించారు. కొన్నాళ్లకు రేష్మ.. నవాజ్‌తో ప్రేమలో పడింది. కొద్ది రోజులుగా రేష్మకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక.. బావను వదిలి ఉండటం ఇష్టం లేక ఆమె ఈ నెల 8న పురుగుల మందు తాగింది.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేష్మాబేగం అక్కతో పాటు నవాజ్‌ వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. రేష్మ తాగిన విషం సీసా ఏదంటూ అడిగి తీసుకున్న నవాజ్‌.. అందరూ చూస్తుండగానే అందులోని మిగిలిన విషాన్ని తాగేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నవాజ్‌, రేష్మ గురువారం కోలుకున్నారు. ప్రాణం పోసిన ఆస్పత్రిలోనే మతపెద్దలను, రెండు గ్రామల పెద్దలను పిలిపించి ఇద్దరికీ కుటుంబ సభ్యులు నిఖా జరిపించారు.

Check Also

నేడు నామినేషన్‌ వేయనున్న జగన్‌

Share this on WhatsAppసీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో బహిరంగసభ పులివెందుల: పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *