Breaking News
Home / States / Andhra Pradesh / ప్రేమ, పెళ్లి.. ముగిసిన జీవితం!

ప్రేమ, పెళ్లి.. ముగిసిన జీవితం!

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

తూర్పు గోదావరి/ధవళేశ్వరం: పరిపక్వత లేని వయసులో ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని కులాంతర వివా హం చేసుకున్నారు. కొన్ని నెలలకే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం ధవళేశ్వరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ధవళేశ్వరానికి చెందిన తురంగి జగదీష్‌(19) సింగిల్‌ సిట్టింగ్‌లో ఇంటర్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో సీటీఆర్‌ఐకి చెందిన కోట దీప్తి(18)ని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో వద్దని వారించారు. దీంతో పెద్దలకు తెలియకుండా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ధవళేశ్వరం కొత్తపేటలోని ఓ ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లి తరువాత జగదీష్‌ 2 నెలలు బట్టల షాపులో పనిచేసి మానేశాడు. తర్వాత అప్పులు చేసి ఆరు నెలలు నెట్టుకొచ్చారు. ఇక ఏదో పని చేయకపోతే జీవితం గడవదని భావించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే ఆర్థిక కష్టాలు వారిని చుట్టుముట్టాయి. అప్పులు తీర్చలేక, ఆత్మాభిమానం చంపుకుని కన్నవారిని ఆశ్రయించలేక, ఉద్యోగం దొరక్క శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మణానికి పాల్పడ్డారు.

శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పై పోర్షన్‌ కు వెళ్లిన ఇంటి ఓనర్‌ కాంతం.. విగతజీవులుగా పడిఉన్న వారిద్దరినీ చూసి దిగ్ర్భాంతికి గురయ్యారు. రాత్రి తన ఇంట్లోనే దీప్తి చాలాసేపు ఉందని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే అద్దె బకాయి చెల్లిస్తానని చెప్పిందని, కూర ఇమ్మని అడిగి తీసుకుని వెళ్లిందని విలపిస్తూ చెప్పింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలిపింది. విషయం తెలిసిన జగదీష్‌ సోదరుడు వెంకటేష్‌ భోరుమని రోదిస్తూ అక్కడికి వచ్చాడు. తమ్ముడి మృతదేహం మీదపడి కన్నీరుమున్నీరయ్యాడు. వద్దంటే పెళ్లి చేసుకున్నాడని, వారి ఇబ్బందులను చూసి తానే అప్పుడప్పుడు ఆర్థికంగా సాయపడేవాడినంటూ తెలిపాడు. కొద్దిరోజుల క్రితం రూ.27 వేలు అడిగితే మాత్రం ఇవ్వలేకపోయానన్నారు. ఆర్థిక ఇబ్బందులే యువజంట మరణానికి కారణమై ఉండొచ్చని ధవళేశ్వరం సీఐ బాలసౌరి తెలిపారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *