Breaking News
Home / National / ప్రేమికులారా! ఇలా తప్పించుకోండి : శశి థరూర్

ప్రేమికులారా! ఇలా తప్పించుకోండి : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులకు ఓ సలహా ఇచ్చారు. ప్రేమికుల దినోత్సవం అంటే భారతీయ సంప్రదాయ ఉత్సవమని అభివర్ణించారు. సంప్రదాయవాదుల నుంచి ప్రేమ జంటలు ఎలా తప్పించుకోవాలో చెప్పారు.

గురువారం ఆయన ఇచ్చిన ట్వీట్‌లో ‘‘హ్యాపీ వాలంటైన్స్ డే. ఓ ఫ్రెండ్‌తో కలిసి బయట తిరుగుతున్నందుకు సంఘ్ పరివార్ కుర్రాళ్లు మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తే, ప్రాచీన భారతీయ సంప్రదాయమైన కామదేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పండి’’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌కు చాలా స్పందనలు వస్తున్నాయి. కొందరు ట్విటరాటీలు ఆయనను ఘాటుగా విమర్శించారు.

Check Also

జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్

Share this on WhatsAppతమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *