Breaking News
Home / States / పెళ్లికి అంగీకరించరేమోనని ఆత్మహత్య….

పెళ్లికి అంగీకరించరేమోనని ఆత్మహత్య….

భద్రాద్రి కొత్తగూడెం: తమ పెళ్లికి పెద్దలు అంగీకంచరేమోనన్న భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పినపాక మండలానికి చెందిన చిన్నిస్వామి(22), ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదు. చాలా సార్లు వారిని ఇరు కుటుంబాలు వారించగా.. వారు తమ పెళ్లిని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారని భావించిన ఆ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. యువకుడు చిన్నిస్వామి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *