Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని ఓయూ విద్యార్థి సుదేంద్ర సింగ్ దాఖలు చేశారు. దీనిపై కుందన్‌బాగ్‌లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ ప్రారంభమైంది.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీని విస్మరించడంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. సమ్మె వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *