హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ టీపీఎఫ్ కార్యాలయం నుంచి ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటిని అరెస్టు చేసిన పోలీసులు నేడు హైకోర్టులో పరచనున్నారు. ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. మద్దిలేటి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి టీపీఎఫ్ కార్యాలయంలో ఉన్నవారిని అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.
