Breaking News
Home / Film News / మ్యూజిషియన్‌గా మాధవన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…

మ్యూజిషియన్‌గా మాధవన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…

హైదరాబాద్‌: ఒకప్పుడు లవర్‌బాయ్‌గా పేరుపొందిన ప్రముఖ నటుడు మాధవన్‌ మ్యూజిషియన్‌గా మారారు. నిజ జీవితంలో అనుకుంటున్నారా..? కాదండీ.. ఆయన ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సెలబ్రిటీ మ్యూజిషన్‌ ఆంటోనీ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో మాధవన్‌ పాత్రను తెలియజేస్తూ ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేస్తూ ‘ఆయన అందంతో మీ గుండెల్ని కొల్లగొడతాం’ అని పేర్కొంది.

‘భాగమతి’ హిట్‌ తర్వాత అగ్రకథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన అనుష్క ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘నిశ్శబ్దం’ చిత్రానికి పంచ మంత్‌ మధుకర్‌ దర్శకుడు కాగా అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *