Breaking News
Home / National / రమణీయం… కమనీయం… మహాబలిపురం… ఎగబడుతున్న పర్యాటకులు

రమణీయం… కమనీయం… మహాబలిపురం… ఎగబడుతున్న పర్యాటకులు

చెన్నై : చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, ప్రధాని మోదీ మహాబలేశ్వరాన్ని సందర్శించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలేశ్వరాన్ని సందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు తెగ ఉత్సహాన్ని చూపిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. చైనా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో స్థానిక అధికారులు రోజు వారి కంటే ప్రత్యేకమైన, ఆకర్షణీయ ఏర్పాట్లు చేశారు. పంచ రథాలు, కృష్ణుడి వెన్నబండ, అర్జున్ పెనాన్స్, లైట్ హౌజ్…. ఇలా అత్యంత అరుదైన వాటిని సుందరంగా అలంకరించి తిరిగి వాటిని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు.

అంతేకాకుండా స్వాగత తోరణాలను ఏర్పాటు చేసి వాటిని వివిధ రకాలైన పండ్లతో, పూలతో శోభాయమానంగా అలంకరించారు. కొందరు సందర్శకులైతే వాటిని కోసుకొని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడ వున్న గోడలకు ఆకర్షణీయమైన వివిధ రకాల పేయింటింగ్స్‌ని వేసి మహాబలిపురాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రసిద్ధమైన అక్కడి శోర్ దేవాలయాన్ని నిర్వహణా కారణాల రీత్యా పర్యాటకులకు అందుబాటులోకి తేలేదు. అయితే ఆదివారం నుంచి ఈ దేవాలయాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తేనున్నారు. వీటితో పాటు రోడ్డుకిరువైపులా, స్మారక చిహ్నాల వద్ద ఇండియా-చైనా దేశాల పతాకాలతో అలంకరించారు.

మోదీ, జీజిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశం ముగియగానే, వివిధ రకాల వస్తువులు, శిల్పసౌందర్యంతో ఉన్న దుకాణాలు తెరుచుకున్నాయి. ఇరు దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం ముగియగానే పర్యాటకులు సందర్శనార్థం వచ్చి ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా మహాబలిపురాన్ని తీర్చిదిద్దారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా స్మారక చిహ్నాలకు, గోడలకు లైటింగులను అమర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, పర్యాటకులు కచ్చితంగా ఆకర్షితులవుతారని కొందరు పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. నిర్వాహకులు ఇలాగే ప్రతీరోజూ నిర్వహిస్తూ ఉండాలని, ఇకపై మహాబలిపురం గురించిన ప్రస్తావన వస్తే కచ్చితంగా మోదీ, జీజిన్‌పింగ్ ప్రస్తావన లేకుండా ఉండదని కొందరు పర్యాటకులు అభిప్రాయపడ్డారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *