Breaking News
Home / National / మహాలక్ష్మీ అమ్మవారికి 16 కేజీల చీర…

మహాలక్ష్మీ అమ్మవారికి 16 కేజీల చీర…

పూణే: దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా విజయదశమి నాడు పూణేలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని 16కేజీల పసిడి చీరతో అలంకరించారు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే అమ్మవారికి ఈవిధంగా బంగారు చీరను అలంకరిస్తారు. కనకపు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్ద క్యూకట్టారు. దక్షిణాదికి చెందిన కళాకారులు ఎనిమిదేళ్ల క్రితం దీన్ని రూపొందించారు. 6 నెలలపాటు శ్రమించి ఈ పసిడి చీరను తయారు చేశారు.

Check Also

కరోనా విజృంభణ..ఢిల్లీ లో బెడ్ల కొరత….

Share this on WhatsAppదేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విపత్తు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *