Breaking News
Home / Film News / రవిబాబు సినిమా టీజర్‌పై మహేష్ బాబు కామెంట్‌

రవిబాబు సినిమా టీజర్‌పై మహేష్ బాబు కామెంట్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేష్ బాబు దర్శకుడు, నటుడు రవిబాబును మెచ్చుకున్నారు. రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆవిరి’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హారర్‌ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘హారర్‌ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి తరహా సినిమాల్ని తీయడంలో రవిబాబు మాస్టర్‌. మీకు, మీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్‌ రవి’ అని ఆయన పోస్ట్‌ చేశారు. ‘ఆవిరి’లో రవిబాబుతోపాటు నేహా చౌహాన్‌, భరణి శంకర్‌, ముక్తర్‌ ఖాన్‌, శ్రీ ముక్తా, హిమజా తదితరులు నటిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *