Breaking News
Home / Film News / ‘అసురన్’కు అభినందనలు తెలిపిన మహేష్…

‘అసురన్’కు అభినందనలు తెలిపిన మహేష్…

ఫిల్మ్ న్యూస్: సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ ప్రముఖ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం `అసురన్`కు అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు కూడా `అసురన్` సినిమాను అభినందిస్తున్నారు. భూ తగాదా నేపథ్యంలో రూరల్ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు.

ఈ నెల నాలుగో తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వీక్షించారు. అనంతరం ట్విటర్ ద్వారా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. `అసురన్.. సమాజంలోని వాస్తవ పరిస్థితులను లోతుగా చూపించింది. సినిమా అద్భుతంగా ఉంది. ధనుష్‌కు, వెట్రిమారిన్‌కు, ప్రకాష్ రాజ్‌కు, చిత్రబృందం మొత్తానికి అభినందనలు` అని మహేష్ ట్వీట్ చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *