Breaking News
Home / Entertainment / నిరాడంబరంగా ‘రంగస్థలం’ మహేశ్‌ వివాహం..

నిరాడంబరంగా ‘రంగస్థలం’ మహేశ్‌ వివాహం..

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నటుడు మహేశ్‌ ఆచంట వివాహం గురువారం ఉదయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావనిని ఆయన వివాహమాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాల్లో నటించి మహేశ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *