Breaking News
Home / Film News / సోషల్‌మీడియాలో మహేశ్‌ తాజా పోస్ట్స్….

సోషల్‌మీడియాలో మహేశ్‌ తాజా పోస్ట్స్….

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్‌, సితారతో కలిసి మహేశ్‌ దంపతులు సరదాగా గడిపేందుకు ఈ టూర్‌ వెళ్లారు. టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు మహేశ్‌, నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా వీరు స్విట్జర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మహేశ్‌ తన కుమారుడు గౌతమ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ‘బ్యాక్‌ టు వర్క్‌ అండ్‌ స్కూల్‌’ అని పోస్టు చేశారు. నమ్రతతో దిగిన మరో ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఈ ఫొటో తర్వాత నేను పొలరాయిడ్‌(పొలరొఇడ్)కు అభిమానిని అయిపోయాను. 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాము. ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో విడుదలైన ‘మహర్షి’ సినిమా తర్వాత మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, మహేష్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రష్మిక కథానాయిక. అలనాటి తార విజయశాంతి కీలక పాత్రలో కనిపించున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *