న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఇండియా మార్కెట్లో సరికొత్త మోడల్ బైక్ జావా పెరాక్ బొబ్బర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.94 లక్షలు ఉంటుంది. జావా బ్రాండ్‌ను బొబ్బర్ స్టైలిస్ మోటార్ సైకిల్‌ను 2018లో మొదటిసారిగా విడుదల చేశారు. గత ఏడాది విడుదల చేసినప్పటి ఎక్స్‌షోరూం ధర రూ. 1.89 లక్షలు ఉండేది. జనవరి 2020 నుంచి జావా పెరాక్ బైక్‌లను బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 2, 2020 నుంచి బైక్‌ల పంపిణీ చేస్తామన్నారు.
