Breaking News
Home / Education / ఇంటి వద్దనే నేర్చుకోండి…

ఇంటి వద్దనే నేర్చుకోండి…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఈ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్లు ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఇంటి వద్దనే గణితం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, మరెన్నో నేర్చుకోవచ్చని తెలిపారు. అదే విధంగా పోటీ పరీక్షలకు సైతం సిద్ధం కావొచ్చని మంత్రి సూచించారు. టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలు కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా, Tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile Appలలో ఇవి అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *