Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / హోదా కోసం మాలమహానాడు ధర్నా

హోదా కోసం మాలమహానాడు ధర్నా

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల ని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గొళ్ల అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చే శారు. హోదా కోసం ఆయన నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మం తర్‌లో ధర్నా జరిగింది. అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోరాడాలన్నారు. రాష్ట్రం కోసం పోరాడేవారికే మాలల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చే శారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. త్వరలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *