Breaking News
Home / National / పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన మలేషియా…

పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన మలేషియా…

న్యూయార్క్‌: ఆర్టికల్‌ 370 రద్దు చేసిన సమయం నుంచి పాకిస్థాన్‌ భారత్‌పై విషం చిమ్ముతునే ఉంది. తనకు మద్దతు ఇచ్చే దేశాలను కూడగట్టుకుని, భారత్‌పై తమ అక్కసును వెళ్లగక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు చైనా, టర్కీ దేశాలు మద్దతు ఇస్తుండగా తాజాగా ఇందులో మలేషియా కూడా చేరింది. జమ్మూ-కాశ్మీర్‌ను భారత్‌ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధి సభల మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ ఆరోపణలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5న రష్యాలో మోడీతో భేటీ సందర్భంగా కాశ్మీర్‌ అంశాన్ని ఆక్రమణ ద్వారా కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించానని మహమ్మద్‌ పేర్కొన్నారు. మహమ్మద్‌ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వివాదాస్పద జకీర్‌ విషయంలోనూ ఇలాగే వ్యాఖ్యానించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *