Breaking News
Home / National / ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ!

ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ!

కానీ, 150 సీట్లకు మించి రావు
ఆ పార్టీకి మద్దతివ్వం: మమత
రాహుల్‌ పీఎం అయినా ఓకే!
టీఎంసీ వర్గాల సంకేతాలు
న్యూఢిల్లీ, కోల్‌కతా: ఈ ఎన్నికల్లో బీజేపీయే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కానీ 150 సీట్లకు మించి రావని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘జీ24 ఘంటా’ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బీజేపీకి యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో సీట్లు బాగా తగ్గుతాయని జోస్యం చెప్పారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే ఏర్పడుతుందని.. ప్రధాని ఎవరన్నది అప్పుడే తేలుతుందని స్పష్టం చేశారు.

ఒకవేళ బీజేపీగనక మోదీ, అమిత్‌ షాలను పక్కన పెట్టి టీఎంసీ మద్దతు కోరితే ఇస్తారా అన్న ప్రశ్నకు.. బీజేపీ తమను అత్యంత దారుణంగా అవమానించిందని, ఆపార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రశ్నే లేదని దీదీ తేల్చిచెప్పారు. బెంగాల్‌లో మొత్తం 42 సీట్లూ తమకే వస్తాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై స్పందన కోరగా.. ఆయన ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయి్‌స’గా మారారని మమత ఎద్దేవా చేశారు.

రాహుల్‌ పీఎం అయినా ఓకే!
‘‘నరేంద్ర మోదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి ప్రధాని కాకూడదు. అందుకోసం అవసరమైతే రాహుల్‌ గాంధీ ప్రధాని కావడానికి కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అంగీకరిస్తుంది’’ .. అని టీఎంసీలోని విశ్వసనీయ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ‘‘రాహులే ప్రధాని అని స్టాలిన్‌ అంటే.. అది పెద్ద విషయం కాదు. మోదీ వైదొలగడమే అందరి లక్ష్యం’’ అని స్పష్టం చేశాయి.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *