Breaking News
Home / National / కోల్‌కతా వీధుల్లో మమత భారీ నిరసన ప్రదర్శన

కోల్‌కతా వీధుల్లో మమత భారీ నిరసన ప్రదర్శన

పశ్చిమబెంగాల్‌‌లో బీజేపీ హింసాకాండను రెచ్చగొడుతోందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో బుధవారంనాడు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షోలో జరిగిన హింసాకాండకు బయట రాష్ట్రాల నుంచి బీజేపీ తీసుకువచ్చిన కిరాయి గూండాలే కారణమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తృణమూల్ కాంగ్రెస్…ఇందుకు నిరసనగా భారీ రోడ్‌షో నిర్వహించింది.

నార్త్ కోల్‌కతాలోని బలియాఘట నుంచి శ్యామ్‌బజార్ వరకూ 7 కిలోమీటర్ల ‘లాంగ్ మార్చ్‌’కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ జెండాలు, బ్యానర్లతో పాల్గొన్నారు.

అమిత్‌షా రోడ్‌షోలో చోటుచేసుకున్న హింసాకాండకు మీది బాధ్యతంటే మీది బాధ్యతంటూ బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం ఇవాళ తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మమతా బెనర్జీపై నిషేధం విధించాలని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కోరగా, బయట నుంచి కిరాయి గూండాలను తెచ్చి హింస సృష్టించిన బీజేపీపై టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. హింసాకాండకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఫోటోలను టీఎంసీ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఇవాళ మీడియాకు విడుదల చేశారు

Check Also

నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

Share this on WhatsAppవిజయవాడ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం రానున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *