ఖమ్మం : వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో తమ్ముడిపై అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ్ముడు.. మద్యంలో పురుగుల మందు కలుపుకొని సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని బింగి నరసింహారావు(62)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
