హైదరాబాద్ : ములుగు మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన చిట్టి మల్లేశ్‌గౌడ్(55) శామీర్‌పేట మండలంలోని యాడారంలో గల బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మురహరిపల్లిలో రాజీవ్ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేశ్ గౌడ్ తీవ్రంగా గాయపడగా సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
