ఉస్మానియా యూనివర్సిటీ: పెంపుడు కుక్కను చంపిన కేసులో నిందితుడిని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాలాపేటలో నివాసముంటున్న రమాదేవి సోదరుడు నాగరాజు.. పెంపుడు కుక్కును చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే నాగరాజు రమాదేవి పెంపుడు కుక్కను గొంతు నులిమి చంపేసినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.
